అనంతపురం కళ్యాణదుర్గంలో చిరుత కలకలం - మేకల మందపై దాడి - జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మేకలపై చిరుత దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 3:09 PM IST
|Updated : Nov 11, 2023, 3:23 PM IST
Cheetah Attack on Goats in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లి గ్రామంలో చిరుత దాడిలో 3 మేకలు మృతిచెందాయి. ప్రసాద్ అనే రైతుకు చెందిన మేకల మందలో తెల్లవారుజామున చిరుత దాడి చేసిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతిచెందిన మేకలకు పోస్టుమార్టం నిర్వహించారు. మేకలు చిరుత దాడితోనే చనిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. మేకలు మృత్యువాతపడటం పై రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Three Goats Died by Cheetah Attack in Kalyanadurgam : పగటిపూట మేకల మందపై చిరుత దాడి చెయ్యడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు వచ్చి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తన మూడు మేకలు మృత్యువాత పడటంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. పగలు కూడా ఎవరూ ఒంటరిగా తిరగకూడదని, ఎటు వెళ్లినా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చర్చించుకున్నారు.