ఆంధ్రప్రదేశ్

andhra pradesh

amaravati_farmers_protest

ETV Bharat / videos

రాజధానిగా అమరావతే- 3నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తా: చంద్రబాబు - Amaravati farmers dharnas

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 4:00 PM IST

Chandrababu Supports Amaravati Farmers Protests:  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్‌ని రాజధాని లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు (TDP leader Nara Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. అత్యాశ, అసూయతో జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల త్యాగం వృథా కాదని చంద్రబాబు అన్నారు. ఇంతవరకు వెయ్యిరోజులు ఉద్యమం జరిగిన దాఖలాలు ఎక్కడా లేవని, రైతులు తమ హక్కుల కోసం ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని శాశ్వతంగా సమాధి చేశారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details