Kondapi MLA Press Meet On Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యంపై కొండపి ఎమ్మెల్యే ఆందోళన - ap latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 1:48 PM IST
|Updated : Oct 13, 2023, 2:46 PM IST
Kondapi MLA Press Meet On Chandrababu Health : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై తనకు ఆందోళనగా ఉందని, తమ ప్రియతమ నాయకుడు బరువు కూడా తగ్గారని కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు రోజురోజుకూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించి బాబుకు కుటుంబ వైద్యులతో వైద్యం అందించేందుకు అనుమతించాలని ఎమ్మెల్యే స్వామి కోరారు. ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యంగా, ఆక్షేపణీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Veeranjaneya Press Meet In Prakasam :జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం సహరించని కారణంగా ఆయనకు వరుస చెకప్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంరీత్యా బాబు బరువు తగ్గారని, చర్మంపై దద్దుర్లు వంటి పలు సమస్యలతో బాధ పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. వయసు పైబడిన వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తమ నాయకుడికి కుటుంబ వైద్యుడితో చికిత్స అందేలా చూడాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.