ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chandrababu_reached_home_at_undavalli

ETV Bharat / videos

Chandrababu Reached Home at Undavalli: ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. - భువనేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 10:38 AM IST

Chandrababu Reached Home at Undavalli: రాత్రంతా ప్రయాణించిన చంద్రబాబు.. ఈ ఉదయం 6గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు భువనేశ్వరి హారతి ఇచ్చారు. దారిపొడవునా చంద్రబాబుకు స్వాగతం ఒక ఎత్తైతే ఇంటి వద్ద ఆయనకు లభించిన స్వాగతం మరో ఎత్తు అన్నట్లు సాగింది. రాజధాని రైతులు, మహిళలు భారీగా తరలివచ్చి.. అమరావతి రూపశిల్పి కోసం రాత్రంతా నిరీక్షించారు. రోడ్డుపక్కనే నిద్రించారు. చంద్రబాబు కాన్వాయ్‌ ప్రకాశం బ్యారేజ్‌ దాటగానే.. కరకరట్ట వద్ద పూల బాట పరిచారు. చంద్రబాబుకు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అకారణంగా 52 రోజులు జైలులో నిర్బధించారని కన్నీటిపర‌్యంతం అయ్యారు. 

చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్న తర్వాత.. ఆయన నివాసం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. నిన్న సాయంత్రం 4:40 గం.ల సమయంలో రాజమండ్రి నుంచి విజయవాడ బయలుదేరగా దాదాపు 13గంటలు పైగా అయన ప్రయాణం సాగింది. అభిమానులు పోటెత్తటంతో ట్రాఫిక్​ క్లియర్​ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. కోర్టు నిబంధనల ప్రకారం ఆయన ఎక్కడా కాన్వాయ్​ దిగకుండానే ముందుకు సాగారు. గత రాత్రే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తెలుగుదేశం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రాజధాని రైతుల ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళా రైతులు గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు. చంద్రబాబు నివాసానికి చేరుకున్న అనంతరం ఆయనకు భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. 

ABOUT THE AUTHOR

...view details