ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Raa_Kadali_Raa_Public_Meeting_Arrangments_at_Mallayapalem

ETV Bharat / videos

కృష్ణాజిల్లాలో 18న "రా కదిలిరా" బహిరంగ సభ - సభాస్థలాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు - చంద్రబాబు బహిరంగ సభ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 4:15 PM IST

Raa Kadali Raa Public Meeting Arrangments at Mallayapalem: కృష్ణాజిల్లా మల్లాయపాలెంలో ఈనెల 18న "రా కదిలిరా" బహిరంగ సభకు 25 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. సభా స్థలాన్ని టీడీపీ నేతలు నారాయణరావు, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పరిశీలించారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. ప్రజలందరికీ అనుకూలంగా ఉండేలా సభా స్థలాన్ని ఎంపిక చేసినట్లు నేతలు తెలిపారు. 

ఎన్నికల ముందు గుడివాడలో సభ జరగడం శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందన్నారు. చంద్రబాబు సభ కోసం భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ఈ నెల 5న ఒంగోలు నియోజకవర్గంలోని కనిగిరిలో చంద్రబాబు 'రా కదలిరా' మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కనిగిరిలో నిర్వహించిన 'రా కదలిరా' మొదట సభ నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని నియోజకవర్గాల్లో సభా ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. కాగా ఈ నెల 29 వరకు చంద్రబాబు 'రా కదలిరా' బహిరంగ సభలు కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details