Chandrababu Fire on YSRCP: ఇది కురుక్షేత్ర సంగ్రామం.. కౌరవ వధ జరగాలి..: చంద్రబాబు - AP Latest News
Chandrababu meeting in Pendurthi: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో చెప్పాలని వైసీపీ సర్కార్‌ని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సెంటు భూమిలో ఇల్లు వస్తుందా అని నిలదీశారు. ఏ ఇబ్బంది లేకుండా ఉన్న స్థలంలో.. ఎందుకు ఇళ్లు కట్టడం లేదని ప్రశ్నించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తిలో బహిరంగంగా నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భీమిలిలో మత్స్యకారులకు కేటాయించిన ఇళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తామన్నారు. పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని.. పునరుద్ఘాటించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చేసే రాజకీయాలు చెల్లవని.. కురుక్షేత్రాన్ని తలపించే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో సీఎంగా అడుగుపెడతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. సంక్షేమం, ఇళ్ల స్థలాల పేరిట సీఎం జగన్ పేదల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తాను వస్తే పథకాలు ఆపేస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో సంక్షేమానికి శ్రీకారం చుట్టిందే తెలుగుదేశమని స్పష్టం చేశారు. కుప్పం గురించి కాదని ముందు పులివెందులలో గెలవాలని సవాల్ విసిరారు.