Chandrababu Phone to Punganur and Tamballapally Victims Families: "మీకు అండగా నేనుంటా.. న్యాయపోరాటం ద్వారా అందరినీ విడిపిస్తా" - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్
Chandrababu Phone to Punganur and Tamballapally Victims Families: ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధిత కుటుంబాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అంగల్లు, పుంగనూరు ఘటనల్లో పార్టీ అధినేత చంద్రబాబుతో సహా వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. రెండు ఘటనల్లో 12 ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వగా.. 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వరుస అరెస్టులతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అరెస్టైన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు వారికీ ధైర్యం చెప్పారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవన్నారు. న్యాయం పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తామని చెప్పారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని.. న్యాయ పోరాటం ద్వారా వారందరినీ సాధ్యమైనంత త్వరగా బయటకు తెస్తామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు.
TAGGED:
punganur violence