ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu_Naidu_Selfie_Challenge_to_CM_YS_Jagan

ETV Bharat / videos

Chandrababu Naidu Selfie Challenge to CM YS Jagan : 'ప్రజలకు మేలు చేసే విధానం ఇదీ..' సీఎం జగన్​కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్.. - ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో సెల్ఫీ ఛాలెంజ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 7:22 PM IST

Chandrababu Naidu Selfie Challenge to CM YS Jagan :  ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో సీఎం జగన్​కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. కౌకుంట్ల గ్రామ పరిధిలో హంద్రీ కాలువ, పవన విద్యుత్ ప్రాజెక్ట్, డ్రిప్ ఇరిగేషన్ పై సెల్ఫీలు దిగి ప్రభుత్వానికి సవాల్ చేశారు. హంద్రీనీవా కాలువల పనుల్లో ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

తెలుగుదేశం హయాంలో గ్రీన్ ఎనర్జీ (Greeng Energy) పాలసీ ద్వారా వచ్చిన విండ్ ఎనర్జీ టవర్స్ ను చూపిస్తూ చంద్రబాబు సెల్ఫీ దిగారు. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ల ద్వారా ఎవరి హయాంలో ఎంత ఉత్పత్తి జరిగిందో చెప్పగలరా అంటూ జగన్ కు చాలెంజ్ చేశారు. నాడు డ్రిప్ ఇరిగేషన్ (Drip Irrigation) కు ఇచ్చిన సబ్సిడీ లను ప్రస్తావిస్తూ.. అనంతపురంలో మొదలు పెట్టిన సామాజిక డ్రిప్ ప్రాజెక్టు ఏమైంది అంటూ నిలదీశారు. ఇదీ ప్రజలకు మేలు చేసే విధానం అంటూ జగన్ కు చంద్రబాబు హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details