Chandrababu Naidu Fan Death in Anantapur : 'బాబు' అరెస్టుతో ఆగిన మరో తల్లి గుండె చప్పుడు.. తెలుగుదేశం వీరాభిమాని వెంకటమ్మ - అనంతపురం తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2023, 2:16 PM IST
Chandrababu Naidu Fans Death in Anantapur :చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో మరో గుండె ఆగింది. అనంతపురంలోని అశోక్ నగర్‌కు చెందిన వెంకటమ్మ సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుకు వీరాభిమాని. వెంకటమ్మ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి తన తల్లి బెంగ పెట్టుకుందని, వెంకటమ్మ కుమార్తె చెబుతున్నారు. బాబు ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తను చూసిన తర్వాత అన్నం కూడా తినలేదని, మనస్తాపానికి గురై చనిపోయారని.. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వెంకటమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 వేల ఆర్థిక సహాయం అందించారు.
TDP Senior Fan Died Due To CBN Arrest : చంద్రబాబు జైలుకు వెళ్లిన తరువాత అభిమానులు మనస్తాపానిరి గురై చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల నిరాహార దీక్షలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. జైలులో ఉన్న బాబు అనారోగ్యం బారిన పడటం వల్ల రాష్ట్ర ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.