ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పసుపుమయంగా పులివెందుల.. భారీగా తరలివచ్చిన ప్రజలు

ETV Bharat / videos

Chandrababu Meeting in Pulivendula: పసుపుమయంగా పులివెందుల.. భారీగా తరలివచ్చిన ప్రజలు - AP Latest News

By

Published : Aug 2, 2023, 9:30 PM IST

Chandrababu Public Meeting in Pulivendula: ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లాలోని పులివెందులలో చంద్రబాబు పర్యటించారు. పులివెందుల ముఖద్వారం నుంచి పూలంగళ్లు సర్కిల్ వరకు చంద్రబాబు రోడ్‌షో నిర్వహించి.. పూలంగళ్లు సర్కిల్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రసంగించారు. ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలికారు. పులివెందులకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు చేరుకున్నారు. దీంతో పులివెందుల పసుపుమయంగా మారింది. మొదట సభకు అనుమతి ఇవ్వకపోవడంతో వారి తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. పూలంగళ్లు సర్కిల్‌లోనే మాట్లాడాలని పార్టీ కార్యకర్తలు కోరగా.. వారి కోరిక మేరకు పూలంగళ్లు సర్కిల్‌లోనే సభ నిర్వహించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చి చంద్రబాబుకు నీరాజనం పలికారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్​పై విమర్శలు గుప్పించారు. కేంద్రం మనకు ఇచ్చిన పోలవరాన్ని గోదావరిలో కలిపేసి ప్రాజెక్టును నాశనం చేసిన వ్యక్తి.. జగన్‌ అంటూ ధ్వజమెత్తారు. పులివెందుల రైతులను జగన్‌ దారుణంగా మోసం చేశారని అన్నారు. రాయలసీమలోని ప్రతి ఎకరానికీ నీరిచ్చి.. పాత పంటల బీమా విధానం తెచ్చి రైతులను ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details