ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu Health Updates

ETV Bharat / videos

Chandrababu Health Updates: చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన.. హెల్త్ రిపోర్టు ఇవ్వకపోవడంపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం - Lokesh on Chandrababu Health Condition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 7:53 PM IST

Chandrababu Health Updates: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం, జైళ్లశాఖ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని.. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యుల్లో రోజురోజుకూ.. ఆందోళన పెరుగుతోంది. జైల్లో అనారోగ్యానికి గురైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై, ప్రభుత్వాధికారులు పూర్తిస్థాయి నివేదిక అందజేయాలంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  నిన్న లిఖిత పూర్వకంగా రాజమండ్రి జైలు అధికారులను కోరారు. 

హెల్త్ రిపోర్టులేవీ..ఇప్పటి వరకూ నివేదికను అందజేయకపోవడం పట్ల.. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల తీరుపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ రిపోర్టు ఇవ్వాల్సిన బాధ్యతను జైలు అధికారులు విస్మరించారంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. జైళ్ల శాఖ డీఐజీ వ్యవహారశైలిని.. తప్పుబట్టారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబం, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details