ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu_Naidu_Power_Point_Presentation_About_Irregularities

ETV Bharat / videos

Chandrababu Fires on CM Jagan: వైసీపీ అక్రమాలపై చంద్రబాబు ఆగ్రహం.. ఇసుక దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్​ - ఏపీ రాజకీయ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 7:37 PM IST

Chandrababu Naidu Power Point Presentation About Irregularities :రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్కమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ నేతల అండదండలతో ప్రకృతి వనరులను ధ్వంసం (Chandrababu Comments on Sand Mafia in AP) చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై 48 గంటల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ నాలుగున్నరేళ్లల్లో తవ్విన ఇసుకెంత, వచ్చిన ఆదాయమెంత అని నిలదీశారు. ఇసుక తవ్వకాల విషయంలో జీఎస్టీ ఎంత చెల్లించారు, ఏ సంస్థ పేరున చెల్లించారని చంద్రబాబు ప్రశ్నించారు. NGT ఉత్తర్వుల ప్రకారం SEIAA ఈసీలను రద్దు చేశారా లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

అదే సమయంలో యువగళం పాదయాత్రలో తెలుగుదేశం కార్యకర్తలను కవ్వించిన వైసీపీ వాళ్లను వదిలేసి.. తిరిగి తెలుగుదేశం వారిపైనే అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. దేశానికే గర్వకారణంగా నిలిచిన తెలుగు సినీ పరిశ్రమను సైతం జగన్‌ అవమానించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలపై సీఈసీని కలిసి ఫిర్యాదు చేస్తామన్న చంద్రబాబు అక్రమంగా ఓట్లను తొలగించిన వాళ్లను వదలబోమని స్పష్టంచేశారు. వైసీపీ అరాచకాలపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందన్న చంద్రబాబు.. జగన్‌ చెప్పిన వైనాట్‌ 175 తిరగబడిందని చంద్రబాబు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details