Chandrababu Fires on CM Jagan: జగన్ పనైపోయింది.. దేవుడు కూడా కాపాడలేరు: చంద్రబాబు - Chandrababu comments on YCP
Chandrababu meeting in Mandapeta: జగన్ పనైపోయింది.. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను దేవుడు కూడా కాపాడలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా కోర్టులో జగన్‌కు చిత్తుచిత్తుగా ఓటమి తప్పదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతును మళ్లీ రాజు చేస్తామని.. చంద్రబాబు భరోసా ఇచ్చారు. మండపేట నియోజకవర్గంలో కాజులూరులో 35 ఎకరాలను వైసీపీ నేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ అవినీతి నాయకుల అక్రమాలకు అడ్డు లేకుండా పోతుందని ఏక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు ఇష్టాను రీతిలో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఒక విజన్‌తో పని చేస్తుందని కాని అసమర్ధ జగన్ ప్రభుత్వం అవినీతి తప్ప ఏమీ చేయట్లేదని దుయ్యబట్టారు. వైసీపీ అసమర్థ పాలనకు రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనలో దారి పొడవునా మహిళలు మంగళహారలతో స్వాగతం పలిగారు. వర్షంలోనూ గ్రామస్థులు తెలుగుదేశం నాయకులు అభిమానులు చంద్రబాబు ఘనస్వాగతం పలికారు.