ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chandrababu_fibernet_case

ETV Bharat / videos

Chandrababu Fibernet case : అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు.. పైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టు - చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 2:04 PM IST

Updated : Oct 20, 2023, 2:49 PM IST

Chandrababu Fibernet case : ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నవంబరు 8వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే, స్కిల్‌ కేసులో ముందుగా తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం వెల్లడించింది. స్కిల్‌ కేసు తీర్పు తర్వాత ఫైబర్‌ నెట్‌ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు తెలిపారు. 

అప్పటివరకు పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 8 వ తేదీకి వాయిదా వేసింది. అయితే, దీనిపై నవంబరు 8న కాకుండా అవకాశం ఉంటే 9వ తేదీన విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా  కోరారు. బెయిల్ పిటిషన్‌పై విచారణే కనుక రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు. స్కిల్‌ కేసు తీర్పు తర్వాత ఫైబర్‌నెట్‌ అంశం పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.

Last Updated : Oct 20, 2023, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details