ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Hearing_on_CBN_Anticipatory_Bail_Petition

ETV Bharat / videos

Chandrababu Anticipatory Bail Petition Adjourned ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసు..చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - Inner ring road case updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 4:29 PM IST

Chandrababu Anticipatory Bail Petition Adjourned: అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసుకు సంబంధించి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలను విన్నా ధర్మాసనం.. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ.. ఉత్తర్యులు జారీ చేసింది.

అసలు ఏం జరిగిందంటే.. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ తయారీ ఆమోదంలో.. చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్‌, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని.. వైఎస్సార్సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఎప్రిల్‌ 27న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న పలువురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఆ కేసులో మొదటి నిందితుడిగా చంద్రబాబు నాయుడిని సీఐడీ పేర్కొంది. ఈ క్రమంలో సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం..తదుపరి విచారణను ఈ 21కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details