ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ, జనసేన అధినేతల సమావేశం..

ETV Bharat / videos

Pawan Meet Chandrababu: నాలుగోసారి టీడీపీ, జనసేన అధినేతల సమావేశానికి అవకాశం.. - తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు

By

Published : Jul 21, 2023, 12:26 PM IST

Pawan Kalyan Meeting With Chnadrababu: దిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీరును.. రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు వాతావరణం ఇరుపార్టీ వర్గాల్లోనూ ఉన్నందున.. పవన్ దిల్లీ పర్యటన సారాంశం ఎంటనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇరుపార్టీల అధినేతలు ఇటీవల కాలంలో ఇప్పటికే మూడు సార్లు ప్రత్యేకంగా సమావేశమైనందున తాజాగా మరోసారి భేటీకానున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇరువురు నేతలు అతి త్వరలోనే మరోసారి సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదని రెండు పార్టీల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.  

ఈసారి జరగబోయే భేటీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసే అంశంపై స్పష్టతకు రావొచ్చని.. టీడీపీ-జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. నిన్న మంగళగిరిలో జరిగిన సమావేశంలోనూ.. రాష్ట్రంలో జగన్ పాలన పోయి ఎన్డీఏ పాలన రావాలంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల ఆంతర్యంపైనా అన్ని పార్టీల్లో చర్చ జరుగుతోంది. త్వరలో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌ మధ్య జరిగే భేటీలో వివిధ అంశాలకు స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details