ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బ్రహ్మోత్సవాలు

ETV Bharat / videos

కనుల పండువగా పూర్ణాహుతి... ఇంద్రకీలాద్రిలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు

By

Published : Apr 5, 2023, 5:20 PM IST

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో పూర్ణాహుతి నిర్వహించారు. వైదికులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధాన్య కోట్నోత్సవం, వసంతోత్సవ కార్యకమాలు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో దుర్గాఘాట్ వద్దకు చేరుకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణా నదీ తీరంలో అవభృత స్నాన కార్యక్రమాన్ని చేపట్టారు. చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గంగా దుర్గామల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వెండి రథంపై ఊరేగింపు నిర్వహించనున్నారు. 

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు పూర్ణాహుతి చేపట్టాం. అనంతరం ఉత్సవ మూర్తులను నదీ స్నానం చేయించాం. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటాం. అనంతరం ప్రతి రోజూ వాహన సేవలు కొనసాగుతాయి. పల్లకి వాహనం, నంది వాహనం, సింహ వాహన సేవలు నిర్వహిస్తాం. ఈ రోజు వెండి రథంపై స్వామి వారు, అమ్మ వారిని ఊరేగించనున్నాం. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాం. అధికారులు, పాలక మండలి సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. - కర్నాటి రాంబాబు, పాలకమండలి చైర్మన్, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం

ABOUT THE AUTHOR

...view details