Chain snatchers in Nandyal ముగ్గు వేస్తుండగా గొలుసు చోరీ.. మరో ఘటనలో సగం చైన్‌ను దక్కించుకున్న దొంగలు - సీసీ కెమెరాలో చిక్కిన గొలుసు దొంగతనం ఘటన
Chain snatchers in Nandyal district: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రెండు చోట్ల గొలుసు దొంగలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైకుపై వచ్చి బంగారు గొలుసు లాక్కుని దొంగలు పరారయ్యారు. పాతపేటలో అనసూయ అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆమెతో అడ్రస్ అడుగుతూ ఉండగా మరో వ్యక్తి ద్విచక్రవాహనంలో వచ్చి బైక్ స్టార్టింగ్‌లో ఉంచాడు. అడ్రెస్ అడుగుతూ అనసూయ మెడలో ఉన్న 4 తులాల బంగారు చైన్ లాక్కుని దొంగలు బైక్‌పై పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. చైన్ లాక్కొని వెళుతూ తారకరామ నగర్లో ఉన్న కిరాణా దుకాణం వద్ద ఆగిన దొంగలు.. దుకాణంలో ఉన్న లక్ష్మీ అనే మహిళకు సరుకులు అడిగారు. ఈ క్రమంలో ఆమె వెనుకకు తిరిగగా మెడలో ఉన్న బంగారు గోలుసును గట్టిగా లాగాడు. ఆ సమయంలో ఆమె గోలుసును చేత్తో గట్టిగా పట్టుకుంది. దీంతో సగభాగం ఆమె చేతిలో, మరో సగభాగం దొంగ చేతిలో ఉండిపోవడంతో అది తీసుకుని బైక్‌పై పరారయ్యారు. వరుస దొంగతనాలపై బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.