ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cyclone_affected_areas

ETV Bharat / videos

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ధాన్యం నమూనాల సేకరణ - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 3:50 PM IST

Central Team Visit to Cyclone Affected Areas in Joint West Godavari Districts:మిగ్‌జాం తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేసికందే సమయంలో వర్షాల వల్ల నీట మునగడంతో వారికి కన్నీళ్లే మిగిలాయి. పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపేందుకు ఓ బృందం రాష్ట్రంలో పర్యటనకు వచ్చింది. 

ఇప్పటికే కేంద్ర బృందం కొన్ని జిల్లాల్లో పర్యటించగా నేడు తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. డాక్టర్ బసంత్ నేతృత్వంలోని బృంద సభ్యులు ఏలూరు జిల్లాలోని దెందులూరు, పాలగూడెం, పెదపాడు, వట్లూరు, కొత్తూరు ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలు, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించి పలు వివరాలను రైతుల నుంచి అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. పలుచోట్ల దెబ్బతిన్న ధాన్యం నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్​కు పంపించారు. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు అధికారుల వద్ద వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details