కేంద్ర బృందానికి షాక్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు- పాత తేదీల ఫోటోలు పెట్టడాన్ని తప్పుపట్టిన బృందం సభ్యులు - Farmers affected by Michaung Cyclone in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 7:26 PM IST
|Updated : Dec 14, 2023, 8:12 PM IST
Central Team Visit to Cyclone Affected Areas:నెల్లూరు జిల్లాలో మిగ్ జాం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో (Michaung Cyclone Impact in AP) కేంద్ర బృందం పర్యటించింది. కోవూరు, ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న అరటి, తమలపాకు, వరి పంటలను కేంద్ర బృందం అధికారులు రాజేంద్ర రత్ను, విక్రం సింగ్‌లు పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు నష్టపోయిన రైతులను తమ సమస్యను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట జిల్లా అధికారులు ఉన్నారు.
అనంతరం కలెక్టరేట్లోని తిక్కన భవన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని తిలకించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో మిగ్ జాం తుపాన్‌కు ముందు తారీఖులతో కొన్ని ఫోటోలు పెట్టి ఉండటాన్ని కేంద్ర అధికారులు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో సంభవించిన నష్టాలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తామని కేంద్ర అధికారి రాజేంద్ర రత్ను తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలోని పర్యటించిన అనంతరం తిరుపతికి బయల్దేరనున్నారు.