ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Central_Team_Inspects_Drought_Affected_Areas

ETV Bharat / videos

కరవు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ఆర్థిక సాయంపై హామీ - రాయలసీమలో కరువు మండలాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 1:50 PM IST

Central Team Inspects Drought Affected Areas :రాష్ట్రంలోని కరవు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరవు ఏర్పడి, పంటలను కోల్పోయామని ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల పరిధిలోని రైతులు అంతర మంత్రిత్వ శాఖల కేంద్ర బృందానికి (ఐఎంసీటీ) విజ్ఞప్తి చేశారు. తిరువూరు మండ‌లం లక్ష్మీపురం, ఎర్రమాదు, గంప‌ల‌గూడెం మండ‌లం, గుల్లపూడి గ్రామంలో వ్యవ‌సాయం, రైతు సంక్షేమ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రట‌రీ పంక‌జ్ యాద‌వ్ నేతృత్వంలో బృందం పర్యటించింది. 

AP Farmers Problems With Drought :కేంద్ర బృందం సభ్యులు టీమ్​లుగా విడిపోయి గ్రామాలను, పంట పొలాలను సందర్శించారు. వరి, పత్తి తదితర పంటలకు సంబంధించి జరిగిన నష్టం వివరాలతో కూడిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం సమీపంలోని పత్తి చేనుకు వెళ్లి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటకు జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరవు నేపథ్యంలో ఏర్పడిన పంట నష్టానికి తగిన ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను సమర్పించనున్నట్లు కేంద్ర బృందం సారధి పంకజ్ యాదవ్ వెల్లడించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 50 అదనపు పని దినాలను కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు.

Drought  Zones in Andhra Pradesh :నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి నీటి లభ్యత లేకపోవడం, వర్షాలు లేకపోవడం, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల చెరువుల ద్వారా సాగునీరు లభించకపోవడం తదితరాల కారణంగా తిరువూరు, గంపలగూడెం మండలాల రైతులు ఖరీఫ్​లో పంటలను బాగా నష్టపోయారని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ నుంచి కూడా వర్షాలు సరిగా లేనందున కరవు మండలాల ప్రకటనకు సంబంధించి వివిధ మండలాలకు జరిగిన నష్టాలపై ప్రతిపాదనలు పంపించామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details