ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Central_Panchayat_Raj_Officials_Visit_Eluru_District

ETV Bharat / videos

Central Panchayat Raj Officials Visit Eluru District: పంచాయతీ నిధుల మళ్లింపు..ఏలూరు జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్‌ అధికారుల బృందం పర్యటన - పంచాయతీ నిధుల మళ్లింపుపై కేంద్రం విచారణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 10:23 PM IST

Central Panchayat Raj Officials Visit Eluru District :ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించడంపై కేంద్ర బృంద సభ్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సుమారు 8వేల 660 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు వాడుకోవడంపై పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన పంచాయతీ రాజ్ అధికారుల బృందంతో కలిసి పంచాయతీ రాజ్ ఛాంబర్ సభ్యులు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 

AP Panchayat Raj Chamber Complaint on Diversion Funds : ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పెదవేగి మండలం భోగాపురం గ్రామాల్లో పర్యటించిన కేంద్ర పంచాయతీ రాజ్ అధికారుల బృందం సభ్యులు పంచాయతీల స్థితిగతులపై పరిశీలించారు. కేంద్ర నిధులను విద్యుత్ బిల్లులకు చెల్లించినట్లు జిల్లా పంచాయతీ అధికారి చెప్పడంపై....కేంద్ర బృందం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఛాంబర్ సభ్యులు వివరించారు. కేంద్ర నిధుల వినియోగంపై వివరాలు అందించాలని లేని పక్షంలో విధుల నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించినట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details