ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బైక్​పై నుంచి దూసుకెళ్లిన లారీ

ETV Bharat / videos

బైక్​పై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఒళ్లు గగుర్పొడిచేలా ప్రమాద దృశ్యాలు - road accident in ap

By

Published : Feb 10, 2023, 9:48 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

Manthani Road Accident CCTV Footage: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని ఫ్లైఓవర్‌ వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యభర్తలు పెద్దపల్లి వైపు వస్తుండగా మలుపు వద్ద వెనక నుంచి వస్తున్న లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ దంపతులు లారీ చక్రాల కింద నలిగిపోయారు. గొల్లపల్లికి చెందిన రమేష్ తన భార్య స్వరూపతో కలిసి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రమేష్​ రెండు కాళ్లు నుజ్జునుజ్జు కాగా స్వరూపకు తీవ్ర గాయాలయ్యాయి. రమేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details