ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN Women Army at Bhagavanth Kesari Film Screening

ETV Bharat / videos

CBN Women Army at Bhagavanth Kesari Film Theatres: చంద్రబాబుకు మద్దతుగా... భగవంత్ కేసరి థియేటర్లలో మహిళల నిరసన - సీబీన్ మహిళ సైన్యం ఆందోళన కార్యక్రమం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 5:53 PM IST

CBN Women Army at Bhagavanth Kesari Film Theatres: బాలయ్య మీద అభిమానం.. చంద్రబాబు మీద ప్రేమను.. సీబీన్ మహిళ సైన్యం, భగవంత్ కేసరి చిత్ర ప్రదర్శనలో చూపించారు. మేము సైతం బాబు కోసం అంటూ... బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలో నినాదాలు చేశారు. జై బాబు... జై బాలయ్యా ఆంటూ నినాదాలతో థియేటర్​ దద్దరిల్లేలా గళమెత్తిన సంఘటన విశాఖలోని  బాలకృష్ణ  చిత్రం ప్రదర్శించిన థియేటర్​లో చోటు చేసుకుంది. చంద్రబాబు మద్దతుగా ఆయన అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ మహిళలు ప్లకార్డులను ప్రదర్శించారు. జై సీబీఎన్ అంటూ మహిళా సైన్యానికి చెందిన సభ్యులు నినాదాలు చేశారు. 

సినీ పరిశ్రమకు చంద్రబాబు ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. అయినా సినీ రంగం నుంచి చంద్రబాబు కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై ఎవ్వరూ మాట్లాడకపోవడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంపై సీబీఎన్ మహిళా సైన్యం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details