CBI Ex JD Lakshmi Narayana About Politics: ప్రస్తుత రాజకీయాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 10:46 AM IST
CBI Ex JD Lakshmi Narayana About Politics: ప్రస్తుతం రాజనీతి శాస్త్రం రాజకీయ శాస్త్రంగా మారిపోయిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న రాజకీయాలు ప్రజలను ఏమార్చే రాజకీయాలుగా విశ్లేషించారు. నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామంలో రెండు రోజులపాటు వీవీ.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సంఘం వజ్రోత్సవ వేడుకలు నిర్వహించింది. చివరి రోజు పూర్వ విద్యార్థులు రక్తదాన రక్తదానం చేశారు. ప్రాజెక్టు కాలనీలో పూర్వ విద్యార్థులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా వీవీ లక్ష్మీనారాయణ ప్రస్తుత రాజకీయాలపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజనీతిని నమ్ముకున్న వాళ్లం మనం, మళ్లీ రాజనీతిని తీసుకురావడానికి ఇంకా చాలా కష్టపడాలని పూర్వ విద్యార్థుల సంఘానికి పిలుపునిచ్చారు. మన జీవితాలను ప్రభావితం చేసేది రాజకీయాలు అని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రాజకీయాలు నిర్ణయిస్తున్నాయి అని అన్నారు. మనకు రాజకీయాలకు సంబంధం లేదనుకుంటే అలాగే ఉండిపోతామని, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మనమంతా రాజనీతి మార్గంలో నడుద్దామని పిలుపునిచ్చారు. అవసరమైనప్పుడు ఎక్కడ గొంతు వినిపించాలో అక్కడ వినిపిద్దామని అన్నారు. మనకు స్వార్థం లేదు, ఆస్తులు సంపాదించాలని ఆకాంక్ష కూడా లేదని తన అభిప్రాయాన్ని తెలిపారు. కేవలం ప్రజలు ఆనందంగా ఉండాలి అన్నదే ధ్యేయంగా చెప్పారు.