సాగునీటి కోసం నిరసన - రైతులతో పాటు ఎమ్మెల్యే పయ్యావులపై కేసు - ఏపీలో రైతుల అవస్థలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 3:23 PM IST
Cases Filed Against Farmers and MLA Payyavula: లక్షల రూపాయలు పెట్టుబడితో సాగుచేసే పంటల కోసం నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని అడిగినందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. మిర్చి సాగు ఎండిపోకుండా ఉండేందుకు కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
Farmers Protest on Irrigation in Uravakonda: రైతుల నిరసనకు పీఏసీ ఛైర్మన్ (PAC Chairman), ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(MLA Payyavula Keshav) తో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు మద్దతు తెలిపి వారితోపాటు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో రైతులతో పాటు మద్దతు తెలిపినవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రజలకు అసౌకర్యం కల్పించారని ఎమ్మెల్యేతో పాటు రైతులపై కేసులు నమోదు చేశామని ఉరవకొండ పోలీసులు తెలిపారు. మిర్చి పంటకు ఒక్కతడి కోరుతూ నిరసనలు చేపట్టిన రైతులపై కేసులు నమోదు చేయటం చర్చానీయాంశంగా మారింది.