Forgery Case: తప్పుడు పత్రాలు సృష్టించారు.. పోలీసులకు చిక్కారు - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
Document Forgery Case: చిత్తూరు నగరం ఇరువారంలోని ఓ డీకేటీ భూమి రిజిస్ట్రేషన్ కోసం తప్పుడు రికార్డులు సృష్టించిన డాక్యుమెంట్ రైటర్లు, స్థల యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా నివసిస్తున్న అరుణ అనే మహిళకు డీకేటీ స్థలం ఉండగా.. దాని రిజిస్ట్రేషన్ కోసం ఆమె ప్రయత్నించింది. ఆ భూమికి రిజిస్ట్రేషన్ కాదని అధికారులు తేల్చి చెప్పడంతో ఆమె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ ప్రిన్స్ రాజ్, సుందర్ రాజును ఆశ్రయించింది.
తహసీల్దారుతో పాటు మరో అధికారి పేరిట నకిలీ స్టాంపులు తయారు చేసి.. ఇతర డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు అనుమానం రావడంతో సంబంధిత తహసీల్దారు కిరణ్ కుమార్ సంప్రదించారు. వాటి గురించి తనకు తెలియదని ఆయన వారికి చెప్పారు. దీనిపై తహసీల్దారు కిరణ్ కుమార్ ఫిర్యాదుతో చిత్తూరు రెండో పట్టణ సీఐ మద్దయాచారి.. ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు, అరుణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.