Case Filed on TDP leaders for holding a rally in support of CBN చంద్రబాబుకు మద్దతుగా శాంతిర్యాలీలో పాల్గొన్నందుకు టీడీపీ నేతలపై కేసు నమోదు - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 11:33 AM IST
Case Filed on TDP leaders for holding a rally in support of CBNచంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బుధవారం నెల్లూరులో.. తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం నేతలపైనా కేసులు పెట్టారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ , టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సహా మొత్తం 16 మంది కేసు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బుధవారం నెల్లూరు వీఆర్సీ కూడలిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తొలుత పోలీసులు ర్యాలీకి అనుతమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. కాని తెలుగుదేశం నేతలు పోలీసుల ఆంక్షలను, నిర్బంధాలను దాటుకొని వచ్చి ర్యాలీ నిర్వహించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.