Carrying Young Women On Doli : మన్యంలో తప్పని డోలీమోతలు.. జ్వరమొచ్చిన యువతిని 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన బంధువులు - ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 2:53 PM IST
Carrying Young Women On Doli :అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైద్యం కోసం గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. పెదబయలు మండలం సాలేబులులో ప్రిస్కిల్లా అనే యువతి గత వారం రోజులుగా మలేరియా, టైఫాయిడ్తో బాధపడుతోంది. సాలేబులు గ్రామానికి అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. యువతి ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని జక్కం వరకు డోలీ కట్టి కొండల్లో మోసుకెళ్లి రహదారి మార్గానికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి యువతిని ఆసుపత్రికి తరలించారు.
రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన డోలి మోతలే శరణ్యం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధికి కోట్లు ఖర్చు పెట్టామని అధికారులు, రాజకీయ నాయకులు చేసే ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామానికి మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని గ్రామస్థులు కోరారు.