ఆగి ఉన్న కారులో మంటలు.. చూస్తుండగానే బూడిద.. ఎక్కడంటే..? - car accident news
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలోని ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST