ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Car_Accident_in_Dhone

ETV Bharat / videos

Car Accident in Dhone: మద్యం మత్తులో బైక్​లను ఢీకొట్టి.. బీభత్సం సృష్టించిన కారు.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు - car accidents

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 11:21 AM IST

car accident in cc footage: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డోన్​ పట్టణంలోని తారకరామనగర్​లో వేగంగా వచ్చిన ఓ కారు.. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైయ్యారు. క్షతగాత్రులను స్థానికులు డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి ప్రధమ చికిత్స అందించారు. ఆనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదానికి కారణం కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. అతిగా మద్యం తాగి.. అజాగ్రత్తతో అతివేగంగా.. వాహనాన్ని నడపడమేనని పోలీసులు వారి ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు వారిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details