క్రిస్మస్, న్యూయర్ సందడి షురూ, విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో కేక్ మిక్సింగ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 10:30 PM IST
Cake Mixing Program at Dolphin Hotel Visakhapatnam: రానున్న క్రిస్మస్, న్యూయర్ సందర్భంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమం విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో సందడిగా జరిగింది. ప్రతి ఏటా దాదాపు నెలన్నర ముందుగానే ఈ తరహా కేక్ మిక్సింగ్ చేయడం డాల్ఫిన్ హోటల్లో ఆనవాయితీగా వస్తోంది. అతిథులకు సరిపడా కేక్‌లను సిద్ధం చేయడానికి దీనిని నాందిగా భావిస్తారు. ఎండు ద్రాక్ష, ఇతర డ్రై ఫ్రూట్స్, ఆల్కహాల్ వంటివి ఇందులో కలిపి ఈ కేక్‌ను సిద్ధం చేయనున్నారు. ప్రధాన చెఫ్ సహా, ఇతర చెఫ్‌లు, సిబ్బంది ఉత్సాహంగా ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మిక్సింగ్‌ని 45 రోజుల పాటు ఒక కంటైనర్‌లో ఉంచి.. అనంతరం దీనితో కేక్‌ను తయారు చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా అతిథులకు ఈ మిక్సింగ్‌తో తయారు చేసిన కేక్‌లను అందిస్తామని హోటల్ జనరల్ మేనేజర్ రామకృష్ణ వెల్లడించారు. ప్రతి ఏటా ఈ రకంగా ఆరు వారాల ముందు నుంచి కేక్‌ను సిద్దం చేసే ప్రక్రియను ఆరంభించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని అన్నారు.