Byreddy Rajasekhar Reddy On Chandrababu స్కామ్‌లు చేసే అలవాటు చంద్రబాబుకు లేదు! తప్పుడు కేసులతో టీడీపీకి ఏమీ కాదు: బైరెడ్డి - ఏపీ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 9:31 PM IST
Byreddy Rajasekhar Reddy On Chandrababu: రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజమండ్రి లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు చంద్రబాబు అని బైరెడ్డి తెలిపారు. ఆర్థిక నేరాల చేసి బెయిల్ వున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. స్కాంలు జగన్ కు అలవాటు ఏమోకానీ చంద్రబాబు కు కాదని వెల్లడించారు. చంద్రబాబు అనుభవం అంత వయస్సు కూడా సీఎం జగన్ కు లేదని విమర్శించారు.
చంద్రబాబును స్కాంల్లో ఇరికించడాన్ని బైరెడ్డి రాజశేఖరరెడ్డి త్రీవ్రం గా ఖండించారు. ప్రజలు వున్నంత వరకూ తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అప్రజాస్వామికంగా చంద్రబాబును జైల్లో పెట్టారని బైరెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం ఎడమ కాలుమీద ఎంట్రుక కూడా పీకలేరని హెచ్చరించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని తప్పుల కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబం తీవ్ర దుఃఖం లో వుందని తెలిపారు.