ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bus _Accident_ In_ Prakasam_ District

ETV Bharat / videos

Bus Accident In Prakasam District : ప్రకాశం జిల్లాలో బస్సు- లారీ ఢీ ఒకరు మృతి .. 15 మందికి పైగా గాయాలు - కర్నూలు వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 2:03 PM IST

Bus Accident In Prakasam District :  ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి జాతీయ రహదారిపై  ప్రమాదం (road accident)  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుమున లారీ - ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు 108 వాహనాల్లో వినుకొండ వైద్యశాలలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. కర్నూలు నుంచి గుంటూరు వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు 40 మంది మెప్మా సిబ్బంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళ మార్కాపురం వాసిగా గుర్తించారు. అతి వేగం, బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది..

ABOUT THE AUTHOR

...view details