ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Building_Construction_Workers_Protest_in_Vijayawada

ETV Bharat / videos

Building Construction Workers Protest in Vijayawada: "భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 6:00 PM IST

BuildingConstruction Workers Protest in Vijayawada:వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగం కుదేలైందని.. భవన నిర్మాణ కార్మికుల సంఘం ఎన్టీఆర్​ జిల్లా కార్యదర్శి నరసింహరావు ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తూ.. విజయవాడ ధర్నా చౌక్​లో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఉపాధి కోసం గతంలో ఇతర రాష్ట్రాల నుంచి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రానికి వచ్చేవారని.. ఇప్పుడు ఏపీ నుంచే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని నరసింహరావు అన్నారు. 

ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని.. సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించిందని ఆరోపించారు. తక్షణమే ఆ నిధులను ప్రభుత్వం తిరిగి జమ చేయాలని డిమాండ్​ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా లభించే ఇసుకను అందుబాటులో లేకుండా చేశారన్నారు. సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ ఇచ్చిన సర్కులర్ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details