ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Buchi_Ram_Prasad_comments_on_Bhumana

ETV Bharat / videos

Buchi ram prasad comments: భూమనకు టీటీడీ ఛైర్మన్ పదవా..?: టీీడీపీ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ - టీడీపీ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్

By

Published : Aug 7, 2023, 1:51 PM IST

Buchi Ram Prasad comments on Bhumana : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని నల్లరాయి అన్న వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవా?.. అని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్​ప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్​కి మతం కన్నా డబ్బే ముఖ్యమని అని ఆయన దుయ్యబట్టారు. హిందూ మతంపై గౌరవం ఉండే వ్యక్తిని టీటీడీ ఛైర్మన్​గా నియమించాలని డిమాండ్ చేశారు. జగన్‌కు క్రైస్తవం మీద ఉన్న నమ్మకం హిందూ ధర్మంపై లేదని మండిపడ్డారు. భూమన కరుణాకర్​రెడ్డి ఇంటిలో జరిగిన ఓ పెళ్లి తంతు అంతా  క్రైస్తవ పద్దతిలో జరిగిందనీ, అతనికి టీటీడీ ఛైర్మన్ పదవి తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కరుణాకర్ రెడ్డి టీటీడీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చాలని చూశారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో టీటీడీ ఛైర్మన్ పదవుల్లో అన్ని కులాలకు న్యాయం చేశారని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, టీటీడీ నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. తిరుమలలో గుండె పగిలే రేట్లున్నాయని వాపోయారు. ఇప్పటికైనా టీటీడీ ఛైర్మన్ పదవిని కరుణాకర్ రెడ్డికి కాకుండా హిందూ ధర్మంపై అభిమానం ఉన్న వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details