ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Locals Are Suffering Due To Bridge Collapse

ETV Bharat / videos

Bridge Collapse in Srikakulam District: విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా.. కుప్పకూలిన వంతెన - వెంతెన కూలిన వార్తలు

By

Published : Aug 16, 2023, 10:35 PM IST

Updated : Aug 17, 2023, 6:26 AM IST

Locals Are Suffering Due To Bridge Collapse: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం ఉప్పరిపేట వద్ద ఉన్న వంతెన కుప్పకూలింది.  దీంతో నరసన్నపేట, జలుమూరు మండలాల నడుమ రాకపోకలు స్తంభించాయి. పర్లాం ఇసుక రేవు నుంచి భారీ వాహనాలు రాకపోకల వల్లే వంతెనకు కూలిపోయిందని గ్రామస్థులు ఆరోపించారు.  వంశధార నది నుంచి వచ్చే జలుమూరు ఓపెన్ హెడ్ ఛానల్​పై రోడ్లు భవనాల శాఖకు చెందిన ఈ వంతెన స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే, గత కొంత కాలంగా  పర్లాం ఇసుక రేవు నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది.  తరచూ ట్రాక్టర్లు, లారీలు ఈ వంతెనపై నుంచి ఇసుకలోడ్​తో రాకపోకలు సాగించడంతో వంతెన దెబ్బతిని ఒక్కసారిగా   కుప్పకూలిందని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాగా కూలిపోయిన వంతెనను నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇసుక అక్రమ రవాణా కారణంగా వంతెన కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ఇసుకాసురులపై ప్రేమ వలకబోస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని కోరారు. 

Last Updated : Aug 17, 2023, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details