Fat boy birth:సాధారణ కాన్పులో.. నాలుగున్నర కిలోల బరువుతో పుట్టిన బాల భీముడు - A four andhalf kg boy i Kadiri Government Hospital
అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా 2 కిలోల నుంచి 3.5కిలోల లోపు ఉంటుంది. కానీ ఆ బాలుడు 4.5 కిలోలు ఉన్నాడు. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాల భీముడు పుట్టాడనికుటుంబ సభ్యులు, వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది.
అమడగూరు మండలం తుమ్మలకు చెందిన సుజాత ప్రసవం కోసం కదిరి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో చేరింది. ఉదయం నొప్పులు రావటంతో సాధారణ కాన్పు చేసిన వైద్యులు పండంటి మగబిడ్డకు ప్రాణం పోశారు. అప్పుడే పుట్టిన పసికందును తూకం వేయగా నాలుగున్నర కిలోల బరువు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
సుజాతకు ఇది ముడో కాన్పుకాగా తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువు బరువు ఎక్కువ ఉన్నప్పటికీ సాధారణ కాన్పు కావడం, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటంతో బాలింత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ ప్రత్యూష, సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా, క్షేమంగా ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ సూచించారు.