Boy Dead With Current Shock: చోరీకి యత్నించి.. కరెంట్ షాక్తో బాలుడు మృతి.. - లింగంగుంట్ల వద్ద కరెంట్ షాక్తో బాలుడు మృతి
Boy Dead With Current Shock: టీ దుకాణంలో చోరీకి యత్నించిన ఓ బాలుడు విద్యుత్తు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నరసరావుపేట గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రైల్వేస్టేషన్ మొదటి గేట్ వద్ద నివాసముంటున్న దర్శిగుంట్ల మణికంఠ (13) అనే బాలుడు గత కొంతకాలంగా చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున లింగంగుంట్ల వద్దనున్న నూతన జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న ఓ టీ దుకాణంలో దొంగతనానికి యత్నించాడు. కాగా.. ఈ క్రమంలో దుకాణం లోపలికి ప్రవేశించిన తరువాత విద్యుత్తు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని విషయాన్ని గమనించి నరసరావుపేట గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలోనున్న మార్చురీకి తరలించి మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.