Botsa on CBI: వివేకా హత్య కేసులో డ్రామాలు ఆడేది మేము కాదు.. సీబీఐ: మంత్రి బొత్స - రాజమండ్రిలో రాజకీయ డ్రామా
Minister Botsa Satyanarayana on CBI: రాజమండ్రిలో రాజకీయ డ్రామా జరుగుతుందని, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో డ్రామా ఆడుతుంది తాము కాదని.. సీబీఐ అని విమర్శించారు. రాష్ట్రంలో విద్యా శాఖలో, విధానాలలో చేసిన మార్పులు మరెక్కడా లేవని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏ రంగంలో అయినా 24వ స్థానంలో ఏపీ ఉండేదని, ఇప్పుడు 7వ స్థానంలోకి వచ్చిందని, మొదటి స్థానంలోకి వెళ్లాలనేది జగన్ పట్టుదల అని బొత్స వివరించారు. విశాఖలో రాజధాని పనులు జరుగుతున్నాయన్న అయన.. అమరావతి ఏమైనా బ్రహ్మ లోకమా అంటూ వ్యాఖ్యానించారు. కిలో రెండు రూపాయల బియ్యం అంటే ఎన్టీఆర్.. ఉచిత విద్యుత్, ఫీజు రియింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ అంటే వైఎస్సార్ గుర్తొస్తారని ఆయన అన్నారు.