Bonda Uma Comments on Cheetah Migration: తిరుమలలో చిరుతల సంచారం.. "భక్తులకు ఇచ్చే కర్రతోనే ప్రభుత్వానికి బడిత పూజ చేయాలి" - వైసీపీ నాయకులు ఎర్రచందనం స్మగ్లింగ్
Bonda Uma Comments on Cheetah Migration in Tirumala :గత కొద్ది రోజులుగా తిరుమలలో చిరుతలు, అడవి జంతువుల సంచారం భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ విషయంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేతల తుగ్లక్ చేష్టల వల్లనే అడవి జంతువులు జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి వస్తున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే తిరుమలలో చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయని బొండా ఉమా ఆరోపించారు. వైసీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్ఛగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎర్రచందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుత పులిని తరమడానికి ఇచ్చే ఊత కర్రతో భక్తులు ప్రభుత్వానికి బడిత పూజ చేయాలని ఈ సందర్భంగా సూచించారు. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక కర్ర ఇస్తామంటారా అని ఆయన మండిపడ్డారు. అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికే పిచ్చి మాటలు.. తుగ్లక్ చేష్టలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం.. వైఎస్సార్సీపీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తోందని ఆయన విమర్శించారు. అభివృద్ధి ఎలా చేయాలో అనేది తమ విజన్ డాక్యుమెంట్ అయితే, ఎంత మందిని జైళ్లకి పంపాలో అనేది వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ అని ఆయన ఎద్దేవా చేశారు.
TAGGED:
తిరుమలలో చిరుతల సంచారం