Bomb Found in Jammalamadugu YSR District: జమ్మలమడుగులో బాంబు కలకలం..గతంలో 54 బాంబులు! - Kadapa News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 11:45 AM IST
Bomb Found in Jammalamadugu YSR District :వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో బాంబు కలకలం రేపింది. గతంలో ఇదే స్థలంలో పెద్ద ఎత్తున నాటు బాంబులను పోలీసులు కనుగొన్నారు. మళ్లీ అదే చోట బాంబు దొరకడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ స్థలంలో శుక్రవారం ఉదయం ఒక బాంబును స్థానికులు గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం పోలీసులు అందుకున్నారు. అనంతరం హూటాహుటీన జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, పట్టణ సీఐ సదా శివయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దొరికిన బాంబు గురించి స్థానికులతో ఆరా తీస్తున్నారు.
54 Bombs Found In Jammalamadugu in 2019 : గతంలో 2019 జులై 23 వ తేదీన అదే స్థలంలో 54 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. మళ్లీ అదే స్థలంలో ఒక బాంబు దొరకడంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ప్రస్తుతం దొరికిన ఒక బాంబును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.