ఆంధ్రప్రదేశ్

andhra pradesh

venkaiah_visit_kvp_home

ETV Bharat / videos

స్వగ్రామంలో కేవీపీ సంక్రాంతి విందు - వెంకయ్యనాయుడు సహా ప్రముఖుల హాజరు - కేవీపీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 5:24 PM IST

BJP Venkaiah Naidu Visit KVP House : సంక్రాంతి పండగ వేళ పార్టీలకతీతంగా ప్రముఖులు కలుసుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కలయికకు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం వేదికైంది. కేవీపీ రామచంద్రరావు ఆహ్వానం మేరకు అంపాపురంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. సతీసమేతంగా కేవీపీ నివాసానికి వచ్చారు. సంక్రాంతి సందర్భంగా వెంకయ్యనాయుడు దంపతులను కేవీపీ ఆహ్వానించారు. కేవీపీ ఇస్తున్న విందుకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, సినీ నిర్మాత కె.ఎల్‌. నారాయణ పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో (K.V.P.) రామచంద్రరావు కుటుంబసమేతంగా స్వగ్రామమైన అంపాపురానికి వచ్చారు.

అంపాపురంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆహ్వానం మేరకు వెంకయ్యనాయుడు సతీసమేతంగా కేవీపీ నివాసానికి చేరుకున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో కేవీపీ మర్యాద పూర్వకంగా విందుకు ఆహ్వానించారు. పండగ నేపథ్యంలో కేవీపీతన స్వగ్రామం అంపాపురంలో కుటుంబ సమేతంగా బస చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సినీ నిర్మాత కేఎల్ నారాయణ కూడా విందులో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details