BJP leader VishnukumarRaju ఓట్ల కొనుగోలు కోసమే రూ.2వేల నోట్లను నిల్వ ఉంచుతున్నారు: విష్ణుకుమార్‌రాజు
Interview with Vishnukumar Raju: రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సర్కులేషన్లో ఉన్నవాటన్నింటినీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నోట్లు మార్చుకునేందుకు మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది.. అయితే ఈ రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరిస్తూ రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామమని ఎమ్‌ఎస్‌ఎంఈ జాతీయ బోర్డు సభ్యుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి విష్ణు కుమార్ రాజు అన్నారు. ఎన్నికలలో గంపగుత్తుగా ఓట్ల కొనుగోలుకు పెద్ద ఎత్తున రెండు వేల రూపాయల నోట్లను అక్రమంగా నిల్వ ఉంచుతున్నారని.. రాష్ట్రంలో ఈ నోట్లు ఎక్కడా అందుబాటులో లేకుండా చేస్తున్న పరిణామాలపై తాను గత ఏడాది రిజర్వు బ్యాంకు గవర్నర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానని చెప్పారు. ఐదు వందల రూపాయల నోట్ల రంగును కూడా మార్చి చెలామాణీలోకి తీసుకురావాలని తాను కోరినట్లు చెప్పారు. విష్ణు కుమార్ రాజుతో మా ప్రతినిధి ముఖాముఖి.