ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP President Purandeswari on Sajjala Ramakrishna

ETV Bharat / videos

BJP President Purandeswari on Sajjala Ramakrishna: రాష్ట్రపతి భవన్‌ను కూడా సజ్జల రాజకీయాల్లోకి లాగారు: పురందేశ్వరి - BJP Social Media

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 6:21 PM IST

BJP President Purandeswari on Sajjala Ramakrishna: సర్పంచుల నిధులు దారి మళ్లింపుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. శంఖానాదం పేరిట విజయవాడలో బీజేపీ సోషల్‌ మీడియా ఐటీ వర్క్‌షాప్‌ నిర్వహించారు. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు రానున్నాయని, సోషల్ మీడియాలో బీజేపీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని పురందేశ్వరి తెలిపారు. ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తామన్నారు. పేదలకు వివిధ పథకాలు కేంద్రం అందిస్తోందన్నారు. రక్షా బంధన్ రోజు 200 రూపాయలు మేర గ్యాస్ సిలిండర్​పై ధర తగ్గించారని తెలిపారు. వివిధ ట్రస్ట్ బోర్డుల్లో అన్యమతస్తుల అంశంపై సంతకాల సేకరణ చేశామని పురందేశ్వరి తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరిట దేశమంతా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ వివిధ ప్రాంతాల మట్టిని సేకరించి కార్యక్రమం చేపడతామన్నారు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో కుటుంబసభ్యులంతా హాజరయ్యామని, దానికి రాజకీయ రంగు పులమడం శోచనీయమన్నారు. సజ్జల రాష్ట్రపతి భవన్​ను కూడా రాజకీయాల్లోకి లాగారని పురందేశ్వరి విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details