ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP_Party_Meeting_With_Purandeshwari

ETV Bharat / videos

సార్వత్రిక ఎన్నికలపై పురందేశ్వరి కీలక సమావేశం - Amit Shah Visits AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 3:16 PM IST

BJP Party Meeting With Purandeshwari: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ (BJP) ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిచనుంది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) అధ్యక్షతన సమావేశం జరగనుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీలతో పొత్తు కొనసాగించాలి అనే అంశంపై క్షేత్రస్థాయి అభిప్రాయాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

Amit Shah Visits AP Before Elections: ఇప్పటికే జనసేన పార్టీతో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. జనసేన మాత్రం టీడీపీతో కలిసి పోటీకి వెళ్తామని ప్రకటించింది. ఈ తరుణంలో బీజేపీ వైఖరి ఎలా ఉండాలనే విషయంపై సమావేశంలో అభిప్రాయాలు సేకరించనుంది. సార్వత్రిక ఎన్నికల జరిగేలోపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Home minister Amith shah) రెండు సార్లు ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం లభించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ సహా ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశానికి పురందేశ్వరి హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details