కోడిక్తతి డ్రామాతో గద్దెనెక్కిన జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశాడు : బీజేపీ సత్యకుమార్ - బీజేపీ జాతీయ కార్యదర్శి తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 5:22 PM IST
BJP National Secretary Sathya Kumar Fires On YSRCP : నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నాశనమైందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సామాజిక న్యాయం అంటూ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో బడుగు, బలహీనవర్గాలు, మహిళలపై జరిగినన్ని దాడులు, అఘాయిత్యాలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కోడిక్తతి డ్రామాతో గద్దెనెక్కి, దళిత యువకుడు శ్రీనివాసరావు జైల్లో మగ్గుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని బస్సు యాత్రలు చేసినా, మాయమాటలు చెప్పినా జగన్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
BJP National Secretary Sathya Kumar Comments On jagan :ఒక్క ఛాన్స్ అంటూ సీఎం పదవి దక్కించుకుని ప్రజలకు ఎటువంటి మేలు చెయ్యలేక పోయారని సీఎం జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ జాతీయ కార్యదర్శి (BJP National Secretary) సత్యకుమార్ తీవ్ర వ్యఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కోడి కత్తి ప్రస్తావనతో వైఎస్సార్సీపీ (YSRCP)పాలనను దుయ్యబట్టారు.