ఆటల మాటున నిధుల దోపిడీకి కుట్ర - ప్రజలను హింసిస్తున్న జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు: బీజేపీ - ఏపీ రాజకీయ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 3:30 PM IST
BJP National Secretary Sathya Kumar Fire on CM Jagan: 'ఆడుదాం ఆంధ్ర' అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనాల జీవితాలతో ఆటలాడుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆటల మాటున నిధుల దోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే జగన్ మాత్రం ఏపీని మాయ మాటలతో నడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ క్రమంలో ప్రజలను హింసిస్తున్న సీఎం జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ చురకలు అంటించారు. క్రీస్తు బోధనలతోనైనా జగన్‌లో మార్పురావాలని సత్యకుమారు అన్నారు.
"'ఆడుదాం ఆంధ్ర' అంటూ జనాల జీవితాలతో జగన్ ఆటలాడుతున్నారు. ఆటల మాటున నిధుల దోపిడీకి కుట్ర పన్నారు. ఏపీని మాయ మాటలతో నడుపుతున్నారు. ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ప్రజలను హింసిస్తున్న జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు బోధనలతోనైనా జగన్‌లో మార్పురావాలి." - సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి