BJP MP GVL Narsimha Rao on Capital: కోర్టు కేసులు తేలేవరకూ రాజధానిని విశాఖకు తరలించడం కుదరదు: ఎంపీ జీవీఎల్ - BJP MP GVL Narsimha Rao news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 9:05 PM IST
BJP MP GVL Narsimha Rao on Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసులు తేలేవరకూ.. రాజధానిని విశాఖపట్నానికి తరలించడం సాధ్యం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా చేయలేదని ఆయన పేర్కొన్నారు.
GVL Narsimha Rao Comments: శ్రీకాకుళం జిల్లా విజేత హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్సింహారావు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ''కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీ అభివృద్ధి అవుతుంది. కానీ, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పటం లేదు. యాక్షన్ ఉత్తరాంధ్ర పేరుతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు బీజేపీ కృషి చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఇక, రాజధాని విషయానికొస్తే.. విశాఖను రాజధానిగా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే రాజధాని అంశం కోర్టుల్లో ఉంది. ఇంకా పరిష్కారం కాలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా విశాఖే రాజధాని అని చెప్పటం లేదు. కోర్టులు తీర్పును వెలువరించేవరకూ రాజధానిగా విశాఖను చేయలేరు, చేయటం సాధ్యం కాదు.'' అని ఆయన అన్నారు.