ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP_MP_CM_Ramesh_Comments_on_Kadapa_SP

ETV Bharat / videos

బీటెక్ రవిని హతమార్చేందుకు కుట్ర పన్నిన మాట వాస్తవం కాదా ? ఎస్పీ ప్రమాణం చేయగలరా?: సీఎం రమేష్ - CM Ramesh Kadapa SP Siddharth Kaushal issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 7:02 PM IST

BJP MP CM Ramesh Comments on Kadapa SP: పోలీసులను ఉద్దేశించి తాను తప్పుగా మాట్లాడినట్లు.. కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ (Siddharth Kaushal) ఆరోపించడాన్ని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఖండించారు. సీఐ అశోక్ రెడ్డి వైఖరిని మాత్రమే తాను ప్రస్తానించానని చెప్పారు. సీఐ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న సీఎం రమేశ్.. సరైన సమయంలో బహిర్గతం చేస్తానన్నారు. తెలుగుదేశం నేత బీటెక్ రవిని హతమార్చేందుకు పోలీసులు కుట్ర పన్నిన మాట వాస్తవమన్న సీఎం రమేశ్.. కాదని ఎస్పీ ప్రమాణం చేయగలరా ? అని సవాల్ విసిరారు.

ఇటీవల ఎంపీ మాటలపై కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రమేష్​కు లీగల్ నోటీసు అందజేస్తామని పరోక్షంగా తెలిపారు. ఇదే విషయాన్ని ఇవాళ కడప జెడ్పీ కార్యాలయానికి వచ్చిన సీఎం రమేష్.. ఎస్పీ వ్యాఖ్యలపై స్పందించారు. తనకు ఎస్పీ లీగల్ నోటీసు ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్న ఎంపీ.. లీగల్ నోటీసు ఇచ్చినపుడు పోలీసుల బండారం బయటికి వస్తుందన్నారు. పోలీసులపై తనకు ఎలాంటి ఉద్దేశాలు లేవన్న ఆయన.. తప్పుచేసిన వారిపైనే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నానని చెప్పారు.  తప్పు చేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోకుండా.. తనకు లీగల్ నోటీసు ఇస్తానని ఎస్పీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details